![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -102 లో....ధీరజ్ జాబ్ కోసం ట్రై చేస్తుంటాడు. వెళ్ళిన చోటల్లా నిరాశ ఎదరవుతుంది. మరొకవైపు మీ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయని రామరాజు భాగ్యం వాళ్ళని అడుగుతాడు. ఎక్కడ జనాలు ఉంటే అక్కడే ఇడ్లీ, దోశ అని భాగ్యం భర్త అంటాడు. మీరేం అంటున్నారో నాకూ అర్థం కావడం లేదని రామరాజు అంటాడు. అదేం లేదండి.. మేం ఫైనాన్స్ ఇస్తాం కదా చిన్న వ్యాపారస్తులకి కూడా ఇస్తుంటామని, వాళ్ల వ్యాపారాల దగ్గరికి వెళ్లి అక్కడే ఫైనాన్స్ ఇస్తామని భాగ్యం చెప్తుంది. ఇంకా రెండు ఇల్లులు ఉన్నాయన్నారు కదా ఎక్కడ అని రామరాజు అడుగుతాడు. ఉన్నాయ్ అండి.. వాటి గురించి చెప్పొద్దూ గోడలకి చెవులు ఉంటాయి. విని అధికారులకి చెప్తే చెకింగ్ కి వస్తారని భాగ్యం అంటుంది. లోపల లాకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వీళ్లకి చూపించండి అని తన భర్తకి భాగ్యం చెప్తుంది. అతను వెళ్ళబోతుంటే ఆపి, ఎందుకవన్నీ అవసరం లేదని రామరాజు అంటాడు. ఆ తర్వాత చందు, శ్రీవల్లిలు ఫోన్ నెంబర్ మార్చుకుంటారు.
మరోవైపు ప్రేమ కోసం ధీరజ్ వెయిట్ చేస్తుంటాడు. ప్రేమ రాకపోవడంతో తన ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాడు కాఫీ షాప్ దగ్గర చూసానని తను చెప్తుంది. ధీరజ్ వెయిట్ చేసి రాకపోయే సరికి కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ప్రేమ వెయిటర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అది చూసి దీరజ్ షాక్ అవుతాడు. ధీరజ్ ని చూసిన ప్రేమ వాళ్ల సర్ కి చెప్పి ధీరజ్ వెంట వస్తుంది. నువ్వు జాబ్ చెయ్యకు.. నేను చూసుకుంటానని ధీరజ్ అంటాడు. అవసరం లేదు నీలాగా తేలికగా తీసుకోలేనని ప్రేమ అంటుంది. ధీరజ్ ఎంత చెప్పినా జాబ్ చేస్తానని ప్రేమ అంటుంది. తరువాయి భాగంలో అందరు భోజనం చేస్తుంటే ప్రేమ, ధీరజ్ లు వస్తారు. భోజనం చెయ్యండి అని వేదవతి అంటుంది. ఇద్దరు సైలెంట్ గా వెళ్లి పోతారు. మీరు తినమని చెప్పండి అని రామరాజుతో వేదవతి అంటుంది. అబద్ధాలతో మోసం చేసే వాడు బయట తినకుండా ఉంటాడా అని రామరాజు అంటాడు. ప్రేమ, ధీరజ్ లు బాధపడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |